యూఏఈలో 100% చేరువలో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

- September 22, 2021 , by Maagulf
యూఏఈలో 100% చేరువలో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

యూఏఈ: యూఏఈలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ రేటు 100 శాతానికి చేరువ‌లో ఉంది. యూఏఈ జ‌నాభాలో ప్ర‌స్తుతం 91% మంది క‌నీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రెండు డోసులు పొందిన వారు 81.2 శాతంగా ఉన్న‌ట్లు వివ‌రించారు. వ‌ర‌ల్డ్ ఇన్ డేటా గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌త‌గ‌తిన ఎక్కువ సంఖ్య‌లో వ్యాక్సిన అందించిన దేశాల్లో యూఏఈ ముందు వ‌ర‌స‌లో ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని వివ‌రించారు. యూఏఈ త‌ర్వాత పోర్చుగ‌ల్ రెండో స్థానంలో ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com