కువైట్ విడిచి వెళ్లిన 8461 మంది రెస్టారెంట్ రంగంలోని కార్మికులు
- September 22, 2021
కువైట్: కువైట్లోని రెస్టారెంట్ రంగం సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 8641 మంది సిబ్బంది కువైట్ విడిచి వెళ్లారు. గతేడాది మార్చి 2020 నుంచి ఈ ఏడాది మార్చి 2021 మధ్య కాలంలోనే వేల సంఖ్యలో సిబ్బంది దేశం విడిచి వెళ్లారు. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశీల రాకపై నిషేధం కొనసాగటం కూడా సిబ్బంది నియామకాలకు అడ్డంకిగా మారింది. దీంతో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరత తీవ్రతరం అయ్యింది. ఈ పరిణామాల కారణంగా రెస్టారెంట్ రంగంలోని వర్కర్లకు రెట్టింపు జీతాలు ఇచ్చి తీసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి రెస్టారెంట్ రంగంలో సేవలు అందించే స్థాయిలో స్థానికులకు శిక్షణ లేదని, వారికి ఇప్పటికిప్పుడు ఆ స్థాయి శిక్షణ ఇవ్వటం కూడా సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







