అమెరికాకు చేరుకున్న మోడీ, ఎన్ఆర్ఐల స్వాగతం
- September 23, 2021
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు చేరుకొన్నారు. మూడు రోజుల పాటు మోడీ అమెరికాలోనే పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

బుధవారం నాడు మధ్యాహ్నం మోడీ న్యూఢిల్లీ నుండి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో భారత ప్రధాని మోడీకి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్‌ఐలు భారతీయ జాతీయపతాకాలతో స్వాగతం పలికారు.
అమెరికాతో ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నరేంద్రమోడీ అమెరికా టూర్ సాగుతుంది. క్వాడ్ సదస్సులో మోడీ పాల్గొంటారు. క్వాడ్ సదస్సులో పాల్గొనే ఆయా దేశాల అధినేతలతో కూడ ఆయన సమావేశం కానున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ తో నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఇవాళ కమలా హరీస్ తో మోడీ భేటీ కానున్నారు.రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్గానిస్తాన్ పరిణామాలతో పాటు పలు అంశాలపై నరేంద్ర మోడీ చర్చించనున్నారు. ఈ నెల 26న మోడీ స్వదేశానికి తిరిగి వస్తారు.
వాష్టింగన్ లో ప్రధాన అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో మోడీ భేటీ కానున్నారు. ఇండియాలలో పెట్టుబడులు పెట్టాలని మోడీ అమెరికన్ వ్యాపారస్తులను కోరనున్నారు. ఆపిల్ సీఈఓ టిమ్ కమక్ తదితరులతో మోడీ భేటీ కానున్నారు.ఈ నెల 24వ తేదీన వైట్‌హౌస్ లో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానున్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భారతదేశం యూఎస్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ను మరింత విస్తరించడం వంటి వాటిపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







