మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు యత్నించిన నలుగురికి మూడేళ్ళ జైలు
- September 23, 2021
దుబాయ్: దుబాయ్ కోర్టు ఆఫ్ అప్పీల్, కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇనస్టాన్స్విధించిన జైలు శిక్షను సమర్థించింది. కేసు వివరాల్లోకి వెళితే, నలుగురు సభ్యుల ముఠా, 18 ఏళ్ళ లోపు వయసున్న ఓ మైనర్ బాలికను వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో నలుగురు ఆసియా వ్యక్తులకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అదే శిక్షను దుబాయ్ కోర్టు ఆఫ్ అప్పీల్ సమర్థించింది. గత అక్టోబరులో ఈ ఘటన జరిగింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డిపార్టుమెంట్ - దుబాయ్ పోలీస్ తమకు అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించి, మైనర్ బాలికను వ్యభిచార కూపంలోంచి కాపాడటం జరిగింది. బాధితుల ఆర్థిక అవసరాల్ని గుర్తించి, వారిని ఈ కూపంలోకి లాగుతున్నట్లు నిందితుల్లో ఒకరు విచారణ సందర్భంగా అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







