1,855 ఉద్యోగాలకు విద్యార్హతలతో లింకు పెట్టిన పిఎఎమ్

- September 23, 2021 , by Maagulf
1,855 ఉద్యోగాలకు విద్యార్హతలతో లింకు పెట్టిన పిఎఎమ్

కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, పలు ఉద్యోగాలకు విద్యార్హతల్ని ముడిపెడుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో, కేవలం సరైన విద్యార్హతలు వున్నవారికే వర్క్ పర్మిట్లను జారీ చేస్తారు. కువైటీ అయినా నాన్ కువైటీ అయినా, విద్యార్హతల ప్రకారమే ఇకపై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వుంటుంది. డైరెక్టర్, ఇంజనీర్, డాక్టర్, నర్సు, మిటియరాలజిస్ట్, జనరల్ ఫిజిసిస్ట్, జనరల్ కెమిస్ట్, జియాలజిస్ట్, ఇన్‌స్ట్రక్టర్, టీచర్, మేథమెటీషియన్, స్టాటిస్టిసియన్ అలాగే మీడియా రంగంలో ఉద్యోగాలకు సంబంధించి ఆయా విద్యార్హతలు తప్పినసరి. బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత ఈ ఉద్యోగాలకు తప్పనిసరి. టెక్నీషియన్, ట్రెయినర్, సూపర్‌వైజర్, చీఫ్ పెయింటర్ మరియు రిఫరీ వంటి వాటికి డిప్లమా కనీస విద్యార్హత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com