'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ విడుదల...

- March 17, 2016 , by Maagulf
'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'టైటిల్‌  సాంగ్‌ టీజర్‌ విడుదల...

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన గబ్బర్‌సింగ్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ సాంగ్‌తో కూడిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోలీసు పాత్రలో పవన్‌కల్యాణ్‌ పవర్‌, ఆయన చేసే అల్లరితో కూడిన సన్నివేశాలతో టీజర్‌ ఆకట్టుకునేలా రూపొందించారు. పాటలను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com