బుర్రిపాలెంలో మహేష్ బాబు భార్య నమ్రత పర్యటన
- March 17, 2016
శ్రీమంతుడు సినిమా మహేష్ కు ప్రొఫెషనల్ గానే కాక పర్సనల్ గా కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ సినిమా చూసి చాలా మంది సెలబ్రిటీలు ఊరిని దత్తత తీసుకోవడానికి ముందుకు రావడమే అందుక్కారణం. తను కూడా గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంను అభివృద్ధి చేసి, నాన్నకు ప్రేమతో కానుక ఇద్దామనుకున్నాడు మహేష్. కానీ ప్రకటించి ఏడాదైనా, షూటింగ్స్ బిజీతో ఒక్కసారి కూడా బుర్రిపాలెం వైపు చూడటానికి మహేష్ కు వీలు చిక్కలేదు. దీంతో మహేష్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు కూడా. అయితే మహేష్ వాళ్ల నోళ్లు మూయించాలని ఫిక్సైనట్టున్నాడు. తాజాగా తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు సోదరి గల్లా పద్మను బుర్రిపాలెం గ్రామానికి పంపాడు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. ఊరంతా తిరిగి చూసి, అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అన్నీ నోట్ చేసుకోమని నమ్రతకు మహేష్ సూచించాడట. సూపర్ స్టార్ కృష్ణకు బుర్రిపాలెం అంటే చాలా అభిమానం. ఆయన హీరోగా బుర్రిపాలెం బుల్లోడు అనే సినిమా కూడా వచ్చింది. తను పీక్ లో ఉన్నప్పుడు కృష్ణ ఊరికి బాగానే సాయం చేశారు. ఆ తర్వాత ఆయన ఫేడవుట్ అయిపోవడం, ఊరికి దూరంగా ఉండటం జరిగింది. లేటెస్ట్ గా ఆయన తనయుడు ఊరిని బాగుచేసే పని తీసుకోవడంతో, ఊరు అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆనందిస్తున్నారు బుర్రిపాలెం ప్రజలు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







