హైపర్ లూప్ తొలి ప్రయాణికుడయ్యే అవకాశం ఎక్స్‌పో 2020 దుబాయ్ ద్వారా

- September 27, 2021 , by Maagulf
హైపర్ లూప్ తొలి ప్రయాణికుడయ్యే అవకాశం ఎక్స్‌పో 2020 దుబాయ్ ద్వారా

యూఏఈ: పూర్తి స్థాయి హైపర్ లూప్ కార్గో పాడ్ మరియు కట్ - ఎవే ప్రయాణికుల పాడ్‌లను డీపీ వరల్డ్ ఫ్లో పెవిలియన్ వద్ద ప్రదర్శిస్తారు. ఇది ఎక్స్‌పో 2020 దుబాయ్ ప్రధాన ఆకర్షణ కానుంది. సందర్శకులు కమర్షియల్ కార్గో పాడ్ నమూనాని చూడవచ్చునని వర్జిన్ హైపర్ లూప్ వెల్లడించింది. 10 మీటర్ల పొడవు వుంటుంది ఇది. అలాగే సందర్శకులు కట్ వే, ప్రయాణికుల పాడ్‌లో కూర్చొని హైపర్ లూప్ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో, ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలంతా మరిన్ని విషయాలు తెలుసుకోవల్సి ఉందని హైపర్ లూప్ ప్రతినిధి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com