కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం: GHMC మేయర్
- September 27, 2021
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరించారు. సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ....వాతావరణ శాఖ సూచన మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్.ఎఫ్.ఏ, జవాను నుండి జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు 24 గంటల పాటు పని చేస్తారన్నారు. అందు కోసం 170 మాన్సూన్ టీమ్ బృందాలు, 92 స్టాటిస్టిక్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం తప్పు ఎవ్వరూ బయటకు రావద్దన్నారు. 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు అవసరమైతే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో 040- 21111111 నంబర్ హెల్ప్ లైన్ 24 గంటల పాటు 3 షిఫ్ట్ లో పని చేసే సిబ్బంది నీ ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదురైనా పక్షంలో హెల్ప్ లైన్ ను సంప్రదిస్తే వెంటనే సహాయక చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 202 మోటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసి ద్వారా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







