మస్కట్ ఇండియన్ స్కూల్లో ట్యూషన్ ఫీజు పెంపు
- March 17, 2016
ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్ఎం) ట్యూషన్ ఫీజుని పెంచింది. ఈ పెంపు నెలకి 4 ఒమన్ రియాల్స్‌గా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని నోటీసు ద్వారా పేర్కొంది స్కూలు యాజమాన్యం. ప్రస్తుత ఫీ స్ట్రక్చర్కి అదనంగా ఏడాదికి 48 ఒమన్ రియాల్స్ చెల్లించవలసి ఉంటుంది విద్యార్థుల తల్లిదండ్రులు. ఇండియన్ స్కూల్ మస్కట్‌లో చదువుతున్న విద్యార్థి తండ్రి మనోజ్ బాలకృష్ణన్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు నిర్ణయం ఆహ్వానించదగ్గది కాదనీ, ఇంక్రిమెంట్లు లేక బోనస్‌లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఫీజుల పెంపు ఇబ్బందికరమని అన్నారు. ఫీజుల పెంపుకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన ప్రచారం మొదలు పెట్టారు. గత ఏడాది ఈ పెంపుదల 1.5 ఒమన్ రియాల్స్‌గా ఉంది. ఇండియన్ స్కూల్ ఒమన్‌లో 9,000 మంది విద్యార్థులు కెజి1 నుంచి క్లాస్ 12 వరకు చదువుతున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









