వలసదారులైన పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వీసాలు

- September 29, 2021 , by Maagulf
వలసదారులైన పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వీసాలు

మస్కట్: వివిధ దేశాలకు చెందిన 20 మందికి పైగా వలసదారులైన పెట్టుబడి దారులకు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాలను మంజూరు చేయడం జరిగింది.మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ర్టీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు అలాగే పదవీ విరమణ చేసిన  వారికి ఈ లాంగ్ టర్మ్ వీసా లభించే అవకాశం ఉంది. అందుకోసం మినిస్ట్రీకి చెందిన ఈ - ఇన్వెస్టిమెంట్ సర్వీసెస్ విభాగం ద్వారా దరఖాస్తుల్ని అక్టోబర్ 3 నుంచి స్వీకరిస్తారు. ఒమన్ విజన్ 2040 లో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఒమన్ సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయి.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com