ఐదేళ్ల గడువుతో మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా విశేషాలు

- September 29, 2021 , by Maagulf
ఐదేళ్ల గడువుతో మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా విశేషాలు

యూఏఈ: యూఏఈలోని ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాల ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అన్ని దేశాలకు చెందిన వారికి ఈ వీసాలు మంజూరు చేస్తామని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ వెల్లడించింది. ఈ వీసా ద్వారా పర్యాటకులు సొంతంగా స్పాన్సర్ చేసుకుంటూ ఎన్నిసార్లయినా యూఏఈలో పర్యటించొచ్చు. ప్రతి పర్యటనలోనూ గరిష్టంగా 90 రోజులు యూఏఈలో ఉండడానికి వీలుంటుంది. ఆ సమయాన్ని మరో 90 రోజులు పొడిగించుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారులు 650 దిర్హాములు చెల్లించాలి. ఐసీఏ వెబ్‌సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు బ్యాంక్ స్టేట్‌మెంట్లు, తదితర డాక్యుమెంట్లన్నీ ఈ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.అబుధాబి, షార్జా, అజ్మన్, ఉమ్ అల్ కొవైన్, రస్ అల్ ఖైమా, ఫుజారియా, అల్ అయిన్, అల్ దఫ్రా ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకునేవారుhttp://www.ica.gov.ae ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్‌పో 2020 నేపథ్యంలో విజిటర్స్ పెద్ద సంఖ్యలో మల్టిపుల్ ఎంట్రీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఏజెంట్లు చెబుతున్నారు.
దరఖాస్తు చేసుకొనే విధానమిది
పేరు, సర్వీస్, బెనిఫీషియరీ వివరాలు, యూఏఈలో అడ్రస్, యూఏఈ వెలుపల అడ్రస్ పేర్కొనాలి. ఫోటో, పాస్‌పోర్ట్ కాపీ, మెడికల్ ఇన్సూరెన్స్, 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్ (గడిచిన 6 నెలల్లో కనీసంగా 4,000 అమెరికన్ డాలర్ల విలువైన బ్యాలెన్స్ కలిగి ఉండాలి) అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ సరి చూసుకోవాలి. అప్లికేషన్ కోసం చెల్లింపు చేయాలి. వీసా ఈ - మెయిల్ ద్వారా వస్తుంది. వీసా ఉపయోగించి, తొలిసారి యూఏఈ వెళ్లినప్పటి నుంచి మొత్తం ఐదేళ్ల లోపు గడువు పూర్తవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com