బెంగళూరులో జరగనున్న శ్రీజ కళ్యాణ్‌ల వివాహం...!!
- March 17, 2016
అక్కడట..ఇక్కడట అంటూ వార్తలు షికార్లు చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక తెలిసిపోయింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ తో ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు.అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు.
మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్ కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









