భారత్ కరోనా అప్డేట్

- October 02, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 24,354 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33, 791, 061 కి చేరింది. 2,73,88 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 234 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4, 48, 373 మంది కరోనాతో మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 14,29,258 కరోనా పరీక్షలు చేయగా..మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 57,19,94,990 కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com