ఇండియన్ పోస్టల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..
- October 03, 2021
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ పోస్టల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటా ద్వారా తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 221 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ (72), పోస్టుమ్యాన్ (90), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (59) ఖాళీలు ఉన్నాయి.
- పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100వరకు జీతంగా చెల్లిస్తారు.
- పోస్ట్ మ్యాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ 59,100 జీతంగా చెల్లిస్తారు.
- మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏడీ (రిక్రూట్మెంట్), సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిలీ – 110001 అడ్రస్‌కు పంపించాలి.
- అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
- దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (04-10-202) ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 12-10-2021గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







