బూస్టర్ డోస్ కు కువైట్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

- October 05, 2021 , by Maagulf
బూస్టర్ డోస్ కు కువైట్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కువైట్: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ సేఫ్ సైడ్  గా బూస్టర్ డోస్ ను కూాడా ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు డోస్ లు వేసుకున్నప్పటికీ కొంతమందికి కరోనా పాజిటివ్ వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులున్న 60 ఏళ్లుకు పైబడిన వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరికి రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తైన సరే బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రంట్ లైన వర్కర్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఈ మూడు గ్రూప్ ల వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే 6 నెలల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం సూచించిన మూడు గ్రూప్ ల వారు మొబైల్ మెసేజ్ ద్వారా గానీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కువైట్ ప్రభుత్వం తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com