'అఖండ' షూటింగ్ పూర్తి.!

- October 05, 2021 , by Maagulf
\'అఖండ\' షూటింగ్ పూర్తి.!

నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా అఖండ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మొట్టమొదటి సారిగా శ్రీకాంత్ నెగిటివ్ రోల్ లో నటించినట్టు తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు బాలయ్య-బోయపాటి కాంబో లో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.దాంతో అఖండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాతో వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా త్వరలోనే సినిమాను థియేటర్ లో విడుదల చేస్తామని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com