'అఖండ' షూటింగ్ పూర్తి.!
- October 05, 2021నటసింహం నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా అఖండ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మొట్టమొదటి సారిగా శ్రీకాంత్ నెగిటివ్ రోల్ లో నటించినట్టు తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు బాలయ్య-బోయపాటి కాంబో లో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.దాంతో అఖండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాతో వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని బాలయ్య అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా త్వరలోనే సినిమాను థియేటర్ లో విడుదల చేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!