తెలుగులో డబ్బింగ్ చెప్పిన తమిళ గణేష్ వెంకట్రామన్
- March 18, 2016
'ఆకాశమంత' సినిమాలో త్రిషకు భర్తగా నటించారు నటుడు గణేష్ వెంకట్రామన్. ప్రస్తుతం ఆయన త్రిష కథానాయకిగా నటించిన 'నాయకి' చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని గణేష్ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ... దర్శకుడు గోవర్దన్ రెడ్డి(గోవి)తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నానంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తనపై ఇంత నమ్మకం పెట్టుకుని డబ్బింగ్ చెప్పిస్తున్న దర్శకుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్రిష కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తున్నారు.గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లిలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం సమకూరుస్తున్నారు. ఇది హారర్ కామెడీ చిత్రం. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, కోవైసరళ, సత్యం రాజేశ్, జయప్రకాశ్, మనోబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో 'నాయకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







