‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా
- October 11, 2021హైదరాబాద్: తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌కు ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన చేశారు. మా ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ పోటీ చేసి ఓడిపోయారు. నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపోందారు. ఈ ఎన్నికల నేపథ్యంలో అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు, ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఒకిరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఓ దశలో ఈ ఎన్నికల హడావిడి ఎలా మారిందంటే.. కనీసం వేయ్యి ఓట్లు లేని ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. ఇక ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్‌గా ఓడియపోవడంతో ఆయన ప్యానెల్‌కు మద్దతు తెలిపిన నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.’ ప్రాంతీయ వాదం , సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్‌లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. – నాగబాబు’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు.
మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్ 274 ఓట్లు వచ్చాయి. ఈ హోరాహోరీ పోరులో విష్ణు 103 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు