ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వందలాది మంది అరెస్ట్
- October 11, 2021
కువైట్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇటీవల ట్రాఫిక్ వాయలేషన్స్ అతిగా జరుగుతుండటంతో ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులుగా వాహనాల తనిఖీలు స్టార్ట్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 3506 మంది ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడినట్లు గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. 19 వాహనాలు జప్తు చేశారని అల్ అంబా పత్రిక రిపోర్ట్ లో తెలిపింది. 27 మంది జువైనల్స్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి జువైనల్స్ వాహనాలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ జువైనల్ హోమ్స్ కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు విషయంలో కఠినంగా ఉంటామని ఈ సందర్భంగా అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







