‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

- October 11, 2021 , by Maagulf
‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

హైదరాబాద్: తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌కు ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన చేశారు. మా ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ పోటీ చేసి ఓడిపోయారు. నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలుపోందారు. ఈ ఎన్నికల నేపథ్యంలో అటు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు, ఇటు ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఒకిరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఓ దశలో ఈ ఎన్నికల హడావిడి ఎలా మారిందంటే.. కనీసం వేయ్యి ఓట్లు లేని ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. ఇక ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్‌గా ఓడియపోవడంతో ఆయన​ ప్యానెల్​కు మద్దతు తెలిపిన నటుడు, మెగా బ్రదర్​ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.’ ప్రాంతీయ వాదం , సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. – నాగబాబు’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు.

మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్ 274 ఓట్లు వచ్చాయి. ఈ హోరాహోరీ పోరులో విష్ణు 103 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com