ETCA మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

- October 11, 2021 , by Maagulf
ETCA మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

దుబాయ్: తేదీ 09/10/2021 శనివారం రోజున ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA)  మరియు తెలంగాణ జాగృతి  సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్ లోని గ్రాండ్ ఎక్సెల్షియర్ హోటల్ లో  నిర్వహించిన 11 వ బతుకమ్మ పండుగ ఉత్సవాలు  అంబరాన్ని అంటాయి. గత సంవత్సరం కరోనా విపత్తు కారణంగా జన సమ్మేళనం లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ జూమ్ ఆప్ ద్వారా నిర్వహించిన ETCA  ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం మరియు ప్రభుత్వం  కొన్ని ఆంక్షలు సడలించడం తో 2011 నుండి క్రమం తప్పకుండా  నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు.

సుమారు 300 పైగా మంది తెలంగాణ ప్రవసియులు పాల్గొన్న ఈ వేడుకల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటల, కోలాటాల నృత్యాల నడుమ వేడుక ప్రాంగణం అంటా పండుగ వాతావరణం సంతరించుకుంది. రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ ఆడపడుచు ల పాటలు మరియు చప్పట్లతో ఆవరణ మారుమోగింది. రంగు రంగు పూలతో ఎంతో అందంగా బతుకమ్మలను అలంకరించి..వేడుక అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ, తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా ప్రకటించడానికి ఉద్యమ కాలం నుండి కృషి చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్ష్యురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కృషిని  మహిళ సభ్యులు గుర్తు చేస్తూ అభినందించడం జరిగింది.

ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకలు  పీచర కిరణ్ కుమార్  మరియు  అధ్యక్షుడు రాదరపు సత్యం లు మాట్లాడుతూ 2011 నుండి క్రమం తప్పకుండ  యూఏఈ గడ్డ మీద వందల మందితో ప్రారంభమైన మొదటి బతుకమ్మ సాధారణ పరిస్థితుల్లో పది వేల జన సమ్మేళనం నడుమ బతుకమ్మను కార్మికుల మరియు  తెలంగాణ కుటుంబాల నడుమ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించామని,  ఈ సంవత్సరం  పరిమితులతో అందరిని ఆహ్వానించలే కపోయినప్పటికీ మన పుట్టిన గడ్డ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలన్న నేపథ్యంతో  పరిస్థితులకు అనుగుణంగా ఈ సంవత్సరం  పరిమిత సంఖ్య లో కొద్ది మంది తో ఈ వేడుకలను జరుపుతున్నామని, ఇలాంటి వేడుకలు మన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటించడానికి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని ని తెలియ చెప్పేల ఇలాంటి వేడుకలు దోహదపడుతాయని, కరోనా తగ్గుముఖం పట్టి ప్రభుత్వం పండుగను నిర్వహించడానికి అనుమతిని ఇవ్వడం  చాలా సంతోషంగా ఉందని అలాగే దుర్గమ్మ దయతో కరోనా నివృత్తి అయి యావత్ ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకొంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకొన్నాయి. హాజరయిన వారందరికీ బతుకమ్మ ప్రసాదం, స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు దీపికా అలిగేటి,అల్లూరి సరోజ, ETCA వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్, ETCA అధ్యక్ష్యులు రాధారపు సత్యం, ETCA  ఉపాధ్యక్ష్యులు రాగం అరవింద్ బాబు, ETCA  జనరల్ సెక్రటరీ నరేష్ కుమార్ మాన్యం,గుండెల్లి నర్సింహులు (అధ్యక్ష్యులు-గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి), శేఖర్ గౌడ్(ఉపా ధ్యక్ష్యులు -గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి), శ్రీకాంత్ చిత్తర్వు( TV5 గల్ఫ్ చీఫ్ కో-ఆర్డినేటర్, మాగల్ఫ్.కామ్ చీఫ్ ఎడిటర్), కుంభాల మహేందర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ IPF Dubai), వివిధ ప్రవాసీ కుటుంబాలు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com