వేలాది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దుకు యోచన
- October 11, 2021
కువైట్: మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ వేలాది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేందుకు యోచిస్తోంది. సుమారు నలభై వేల మంది వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అయితే, లైసెన్స్ పొందాకా, వారు తమ ప్రొఫిషన్ మార్చుకున్నారు. దాంతో తమ డ్రైవింగ్ లైసెన్సును వారు కోల్పోయారు. అయినప్పటికీ, ఆ లైసెన్సులను వారు వినియోగిస్తున్నారు. సాధారణంగా 5 కువైటీ దినార్ల ట్రాఫిక్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఆ లైసెన్సు వినియోగిస్తే. ఇదిలా వుంటే, సుమారు 20,000 డ్రైవింగ్ లైసెన్సులను యూనివర్సిటీ విద్యార్ధులకు జారీ చేశారు. అయితే, తమ చదువులు పూర్తయ్యాక, ఆ డ్రైవింగ్ లైసెన్సులను వారు తిరిగివ్వలేదు. అలాంటి వాటిని రెన్యూ చేసే అవకాశం లేకుండా రద్దు చేసేలా మినిస్ర్టీ చర్యలు తీసుకుంటుంది. ట్రాఫిక్ విభాగం మేన్ పవర్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ సంయుక్తంగా పని చేసి, డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేలా మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ వ్యూహ రచన చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







