ఇండియా - బహ్రెయిన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
- October 11, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ మరియు యాంటిక్విటీస్ రేపటి నుంచి అక్టోబర్ 19 వరకూ వారం రోజుల పాటు లిటిల్ ఇండియా ఇన్ బహ్రెయిన్ పేరుతో బాబ్ అల్ బహ్రెయిన్ వద్ద వేడుకలు నిర్వహించనుంది. మినిస్ర్టీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ఎంబసీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ కమ్యూనిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇండియా, బహ్రెయిన్ మధ్య స్నేహ సంబంధాలు మొదలై 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సెమినార్లు, వెబినార్లు, హ్యాండిక్రాప్ట్స్ సహా పలు కల్చరల్ ఈవెంట్స్ ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహిస్తారు. రేపు బాబ్ అల్ బహ్రెయిన్ వద్ద భారత జాతీయ పతాకం రంగులతో ముస్తాబు చేస్తారు. బాబ్ అల్ బహ్రెయిన్ నుంచి, హెరిటేజ్ షాపు వరకూ మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ బ్యాండ్‌తో మార్చ్ జరుగుతుంది. జయవంత్ నాయుడు నేతృత్వంలో మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. హ్యాడ్ బ్లాక్ ప్రింటింగ్ వర్క్ షాప్, కాలా డిజైన్, సాంప్రదాయ భారత కళల మీద సెమినార్ వంటివి నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







