మనీ లాండరింగ్ సమస్యకు చెక్ పెట్టనున్న యూఏఈ
- October 12, 2021
యూఏఈ: మనీ లాండరింగ్‌ను పరిష్కరించే క్రమంలో దేశంలో నిధుల సేకరణ మరియు స్వచ్ఛంద సంస్థల కు అందించే విరాళాలను నియంత్రించే దిశగా కొత్త చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది యూఏఈ. అదే ‘నిధుల సేకరణ నియంత్రణ చట్టం’.
ఈ చట్టం..దేశంలో నిధులను కోరే ప్రభుత్వేతర సంస్థలకు వర్తిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మనీలాండరింగ్ మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్‌పై పోరాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (MOCD) లో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్న నాసర్ ఇస్మాయిల్ చెప్పారు.
నిధుల సేకరణ మరియు స్వచ్ఛంద సంస్థ లకు ఇచ్చే విరాళాలపై ఇప్పటికే యూఏఈ లో కఠినమైన చర్యలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థల ద్వారా చట్టబద్ధంగా మానవతా కారణాల కోసం నిధులను అందించవచ్చు, అయితే నిధులను సేకరించాలనుకునే వారు జాతీయ స్థాయిలో ఇస్లామిక్ వ్యవహారాలు మరియు ఎండోమెంట్ల జనరల్ అథారిటీ నుండి అయినా, లేదా, దుబాయ్‌లో ధార్మిక కార్యకలాపాల విభాగం నుంచైనా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చేయాలి.
స్వచ్ఛంద సంస్థలు మనీలాండరింగ్ మరియు పన్ను ఎగవేత కోసం ఉపయోగించబడుతున్నాయని OECD ఒక నివేదికలో హెచ్చరించింది. కాబట్టి, మనీ లాండరింగ్‌పై పోరాడేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







