యూఏఈ సర్ణోత్సవాలకు అంతా రెడీ...మరో 50 రోజులే
- October 14, 2021
యూఏఈ: సర్ణోత్సవాలకు రెడీ అవుతోంది యూఏఈ. మరో 50 రోజుల్లో అంటే డిసెంబర్ 2, 2021 న 50వ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యూఏఈ నాయకులు స్ఫూర్తిదాయక సందేశాలు ఇచ్చారు.ఈమేరకు వారు ట్వీట్లు చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్ ద్వారా దేశంలోని "ఎమిరేట్స్ అండ్ హార్ట్స్.. యూఏఈ ప్రజలు ఒకే జెండా కింద ఐక్యంగా ఉన్నారు." అని ట్వీట్ చేశారు.అబుధాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూఏఈ చారిత్రాత్మక మైలురాయిని సమీపిస్తోందని అన్నారు."మన దేశ విజయాలలో, దేశ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. మన ముందు ఉన్న మంచి భవిష్యత్తు కోసం ఆశావాదం ధృక్పథంతో ముందుకెళ్దాం.” అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







