హజ్,ఉమ్రా యాత్రికుల కోసం..బయోమెట్రిక్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్
- October 14, 2021
సౌదీ అరేబియా: కువైట్ కు చెందిన హజ్, ఉమ్రా యాత్రికుల బయోమెట్రిక్ సెల్ఫ్ నమోదును సౌదీ అరేబియా ప్రారంభించినట్టు సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి చెప్పారు.ట్యునీషియా, మలేషియా, యూకే, బంగ్లాదేశ్ పౌరులకు కూడా బయోమెట్రిక్ నమోదు విధానం అందుబాటులో ఉంటుందన్నారు.ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉమ్రా వీసాలు పొందాలనుకునే వారు తమ బయోమెట్రిక్ నమోదు చేసుకోవడానికి వ్యక్తిగతంగా రాయబార కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్లవలసిన అవసరం లేదు.వారు తమ బయోమెట్రిక్‌లను వారి స్మార్ట్ ఫోన్‌లలో యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.బయోమెట్రిక్ మ్యాచింగ్ ప్రాసెస్ విజిటర్స్ సౌదీ వచ్చిన సమయంలో జరుగుతుందన్నారు. వీసా, ట్రావెల్ సొల్యూషన్స్ కోసం ఉపయోగించే బయోమెట్రిక్ సెల్ఫ్ నమోదు సర్వీసును సౌదీ కంపెనీ రూపొందించిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







