షేక్ జాబర్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇండియన్

- October 14, 2021 , by Maagulf
షేక్ జాబర్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇండియన్

కువైట్:షేక్ జాబర్ బ్రిడ్జిపై నుంచి దూకి  సూసైడ్ చేసుకునేందుకు ఇండియాకు చెందిన వ్యక్తి ప్రయత్నించాడు.ఐతే అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే అలర్ట్ అయి అతన్ని కాపాడాడు. ఈజిప్ట్ కు చెందిన ఓ వ్యక్తి కూాడా ఇలాగే ఆత్మహత్యాయత్నం చేశాడు. అది జరిగిన  24 గంటల లోపే భారత్ కు చెందిన వ్యక్తి సూసైడ్ కు ప్రయత్నించాడు. ‘జాబర్ బ్రిడ్జ్ నుండి ఒక వ్యక్తి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్‌కు కాల్ వచ్చింది. ఒక పౌరుడు అతడిని రక్షించి భద్రతా అధికారులకు అప్పగించాడు.’అని అక్కడ జరిగిన సంఘటనను ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి వయసు 36 ఏళ్లు.పోలీసులు అదుపులో ఉన్నాడు. అతని మానసిక పరిస్థితి బాగానే ఉందని...చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.కువైట్  నిబంధనల ప్రకారం ఆత్మహత్య కు ప్రయత్నించిన ఇండియన్ ను దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com