నార్వేలో బాణాలతో దాడి, ఐదుగురు మృతి
- October 14, 2021
నార్వే : ఆగ్నేయ నార్వేలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. బాణాలతో ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోంగ్స్ బెర్గ్ పట్టణంలో ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాద కుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడిలో ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు 37ఏళ్ల డానిష్ పౌరుడనీ పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ఇతను కోంగ్స్ బెర్గ్ లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రత్యేక్ష సాక్షిగా ఉన్న మహిళ అక్కడి మీడియాతో మాట్లాడింది. వీపు భాగంలో బాణాలు పెట్టుకొని చేతులో విల్లుపట్టుకున్న వ్యక్తి విచక్షణ రహితంగా బాణాలు విసిరాడని.. దీంతో అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారని తెలిపారు.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







