తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 14, 2021
నిజామాబాదు: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి ప్రారంభమైంది.తెలంగాణ నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామములో ఘనంగా జరుపుకున్నారు.
ఇప్పటికే పట్నం వాసులు పల్లెటూర్లకి చేరుకున్నారు.ఆడపడచుల రాకతో ప్రతిఇంటా కోలాహలం మొదలైంది. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ సందడి సందడిగా మారాయి.
తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ నిర్వహిస్తారు.రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు.రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.సాయంత్రంపూట స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా ఎంతో సంబురంగా ఆడుకుంటారు.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







