"హ్యాపీ లైఫ్" త్వరలో...
- March 18, 2016
పోసాని కృష్ణ మురళి-సుహాసిని (జూనియర్) జంటగా నటించిన "నా పెళ్ళాం.. నా ఇష్టం" చిత్రం పేరు "హ్యాపీ లైఫ్"గా మార్చారు. రామకృష్ణ వీర్నాల దర్సకత్వంలో.. శ్రీ గౌరీదేవి సినీచిత్ర పతాకంపై ఎన్.దేవీచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్సకత్వం వహించడంతో పాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రామకృష్ణ వీర్నాల మాట్లాడుతూ.. "నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న గృహ హింస నేపధ్యంలో.. మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ఇది. పోసాని, సుహాసినిల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. "నా పెళ్ళాం నా ఇష్టం" టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో "హ్యాపీ లైఫ్" అనే టైటిల్ పెట్టాం.ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. కృష్ణ భగవాన్, విశ్వేశ్వర రావు, రామకృష్ణ వీర్నాల ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా; వెంకీ, సంగీతం: రమేష్, నిర్మాత: ఎన్.దేవీచరణ్, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్సకత్వం: రామకృష్ణ వీర్నాల !!
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







