కళాభవన్‌ మణిది అసహజ మరణం...

- March 18, 2016 , by Maagulf
కళాభవన్‌ మణిది అసహజ మరణం...

మలయాళ నటుడు కళాభవన్‌ మణి మృతిపై ఫోర్సెనిక్‌ పరీక్షల అనంతరం ఆయన శరీరంలో విషపూరితమైన పురుగు మందు, ఇథనాల్‌, మిథనాల్‌ అవశేషాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నటుడు, గాయకుడు అయిన మణి(45) మార్చి 6న చనిపోయిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా మణిని మార్చి 4న ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మార్చి 6న చనిపోయారు. వైద్యులు ఆయన శరీరంలో రసాయనాలు ఉన్నట్లు చెప్పడంతో మణి మరణంపై అనుమానాలు రేకెత్తాయి. కొచ్చిలోని కాక్కనాడ్‌లో మణి శరీరంలో విషపూరిత పదార్థాలపై లాబరేటరీ పరీక్షలు చేశారు.పరీక్షలో ప్రమాదకరమైన క్లోర్‌పైరిఫోస్‌ ఉన్నట్లు కెమికల్‌ ఎగ్జామినర్‌ కె.మురళిధరన్‌ తెలిపారు. మణి మరణంపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలపడంతో అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మణిది ఆత్మహత్య కాదని, ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని మణి భార్య తెలిపారు. మణి రెండొందలకు పైగా మళయాళ, తమిళ సినిమాల్లో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com