ప్రవాసుల వర్క్ పర్మిట్ల వివాదం.. PAM డైరెక్టర్ జనరల్ సస్పెండ్
- October 16, 2021
కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్న్ పవర్ (PAM) అహ్మద్ అల్-మౌసాను మంత్రి పదవి నుంచి తొలగించారు. ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ కు సంబంధించి అతను తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు కమిటీ సిఫార్సు మేరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బాధ్యతల నుంచి తొలగించారని స్థానిక అరబిక్ వార్తాపత్రికలు తెలిపాయి. గత సంవత్సరం యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను నిలిపివేస్తూ డైరెక్టర్ జనరల్ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత వారం, ఫత్వా, లెజిస్లేషన్ కమిటీ ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయంతో చాలా మంది ప్రవాసులు తమ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాకపోవడంతో కువైట్ నుండి వెళ్లిపోవలసి వచ్చింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్









