సెప్టెంబర్‌లో 2,869 తనిఖీలు.. రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు
- October 16, 2021
సౌదీ అరేబియా: అల్ రాయన్ మునిసిపాలిటీ అధికారులు నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన రెండు ఫుడ్ సంస్థలపై చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో మొత్తం 2,869 తనిఖీలు చేసిన అధికారులు.. 36 ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఒక నివేదికను భద్రతా అధికారులకు పంపించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ ఎన్విరాన్మెంట్ (MME) తెలిపింది. ఆహార సంస్థలపై మొత్తం 40 ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి. ఫుడ్ సేఫ్టీ విభాగం ఇన్స్పెక్టర్లు 3,265 స్లాటర్ హౌజ్ లలో తనిఖీలు నిర్వహించారు. 186 కిలోల మాంసాన్ని నాశనం చేశారు. అల్ సైలియా మార్కెట్లో 76,789 కిలోల కూరగాయలు, పండ్లను వినియోగానికి అనువుగా లేనందున నాశనం చేశామని, 46 నమూనాలను నాణ్యతా పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







