సుజారమణకి 'సహజ గాయని' బిరుదు ప్రదానం

- October 16, 2021 , by Maagulf
సుజారమణకి  \'సహజ గాయని\' బిరుదు ప్రదానం

హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ , ఇంటర్నేషనల్ వారు , స్వర్ణోత్సవ సంవత్సరంలో  త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో సంస్థ అధినేత కళాబ్రహ్మ, శిరోమణి, సేవామహత్మ డా.వంశీరామరాజు మరియు వంశీ కల్చరల్ మరియు ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో గాయని సుజారమణ కి "సహజ గాయని" బిరుదు ప్రదానం, సినీ సంగీత విభావరి నిర్వహించారు. వ్యాఖ్యాత గా సుధామయి, గాయకులుగా శ్రీయుతులు బాలకామేశ్వర రావు, యమ్.వి రమణమూర్తి, చింతలపాటి మూర్తి తదితరులు, గాయనీమణులు సుజా రమణ, రాగరేఖ, రాణి ,గాయత్రి మరియు రజని 45 చిత్ర గీతాలు ఆలపించి ఆద్యంతం శ్రోతలను రంజింపచేసారు.ముఖ్య అతిధులుగా లయన్ విజయ్ కుమార్, యమ్ వి రమణ మూర్తి విచ్చేసి వంశీ సంస్థల నిర్వహణలో సుంకరపల్లి శైలజ సేవలను, గాయని సుజారమణ గాత్ర మాధుర్యాన్ని కొనియాడారు. వివిధ సాంస్కృతిక సంస్థలు కూడా విచ్చేసి వంశీ సంస్థ నిర్వాహకులను, సన్మాన గ్రహీత ను ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com