'మున్సిపాలిటీ సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్' 300 లావాదేవీలు పూర్తి
- October 16, 2021
బహ్రెయిన్: దక్షిణ ప్రాంత మునిసిపాలిటీ ప్రారంభించిన 'మున్సిపాలిటీ సర్వీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్' సెప్టెంబర్ 2021 వరకు విజయవంతంగా 300 లావాదేవీలను పూర్తి చేసింది. వినియోగదారులకు ఇబ్బంది లేని సేవలను అందించడం, వారి సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా ఈసేవలు మొదలుపెట్టినట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు. మున్సిపల్ లైసెన్స్, ఫిర్యాదులు, విద్యుత్ కోసం దరఖాస్తులు, బిల్డింగ్ పర్మిట్లు సహా 16 సేవలను మొబైల్ యూనిట్ ద్వారా దక్షిణ మునిసిపాలిటీ అందిస్తుంది. వృద్ధులు, జబ్బుపడినవారు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులకు సహాయం చేయడానికి పురపాలక సంఘం గత ఏడాది మేలో సేవలను ప్రారంభించింది. మున్సిపల్ సేవలు ఇంటి వద్దనే పొందడానికి 17986304 లేదా 17986040 కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







