మక్కా, మదీనా మసీదులలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత
- October 16, 2021
సౌదీ అరేబియా: రోజువారి కరోనా కేసులు తగ్గడంతో ఇకపై మక్కా, మదీనా మసీదులలో పూర్తి సామర్థ్యంతో భక్తులను అనుమతించనున్నారు. మాస్క్ ధరించి, ఉమ్రా ట్రాకింగ్ యాప్‌ని ఉపయోగిస్తూ మసీదును భక్తులు సందర్శించవచ్చు. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 17 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, రవాణా, రెస్టారెంట్లు, సినిమా, ఇతర సమావేశాలు మరోసారి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. సామాజిక దూర నిబంధనలను ఎత్తేశారు. సౌదీ అరేబియాలో కొత్త కరోనావైరస్ కేసులు 350 కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
తాజా వార్తలు
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’







