సుజారమణకి 'సహజ గాయని' బిరుదు ప్రదానం
- October 16, 2021
హైదరాబాద్: వంశీ ఆర్ట్ థియేటర్స్ , ఇంటర్నేషనల్ వారు , స్వర్ణోత్సవ సంవత్సరంలో త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో సంస్థ అధినేత కళాబ్రహ్మ, శిరోమణి, సేవామహత్మ డా.వంశీరామరాజు మరియు వంశీ కల్చరల్ మరియు ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో గాయని సుజారమణ కి "సహజ గాయని" బిరుదు ప్రదానం, సినీ సంగీత విభావరి నిర్వహించారు. వ్యాఖ్యాత గా సుధామయి, గాయకులుగా శ్రీయుతులు బాలకామేశ్వర రావు, యమ్.వి రమణమూర్తి, చింతలపాటి మూర్తి తదితరులు, గాయనీమణులు సుజా రమణ, రాగరేఖ, రాణి ,గాయత్రి మరియు రజని 45 చిత్ర గీతాలు ఆలపించి ఆద్యంతం శ్రోతలను రంజింపచేసారు.ముఖ్య అతిధులుగా లయన్ విజయ్ కుమార్, యమ్ వి రమణ మూర్తి విచ్చేసి వంశీ సంస్థల నిర్వహణలో సుంకరపల్లి శైలజ సేవలను, గాయని సుజారమణ గాత్ర మాధుర్యాన్ని కొనియాడారు. వివిధ సాంస్కృతిక సంస్థలు కూడా విచ్చేసి వంశీ సంస్థ నిర్వాహకులను, సన్మాన గ్రహీత ను ప్రశంసించారు.



తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







