'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం..
- October 16, 2021హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు రేసులో అధిక మెజారిటీ గెలుచుకున్న మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ఇటీవల సీనియర్ ఆర్టిస్టులకు ఫించను అందించే విషయంలో చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడిగా ఫైల్‌పై తన మొదటి సంతకాన్ని పెట్టారు విష్ణు. తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో 'మా' నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'మా' కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్స్ ఒకరిని ఒకరు ధూషించుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం మా కు రాజీనామా చేసింది. ఆ ఎఫెక్ట్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కనిపించింది. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి ఒక్క సభ్యుడు కూడా హాజరు కాలేదు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు