'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం..
- October 16, 2021
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగాయి. ప్రకాశ్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు రేసులో అధిక మెజారిటీ గెలుచుకున్న మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచారు. ఇటీవల సీనియర్ ఆర్టిస్టులకు ఫించను అందించే విషయంలో చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడిగా ఫైల్‌పై తన మొదటి సంతకాన్ని పెట్టారు విష్ణు. తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో 'మా' నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'మా' కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్స్ ఒకరిని ఒకరు ధూషించుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇక ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం మా కు రాజీనామా చేసింది. ఆ ఎఫెక్ట్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కనిపించింది. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి ఒక్క సభ్యుడు కూడా హాజరు కాలేదు.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







