రష్యాలో కరోనా విలయతాండవం...
- October 17, 2021
రష్యా: రష్యాలో కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1002 మంది మృత్యువాతపడ్డారు. నిజానికి ఈ వైరస్ వెలుగు చూసిన తొలినాళ్ళలో అపారనష్టాన్ని ఎదుర్కొన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ తర్వాత కాస్త శాంతించింది. ఈ క్రమంలో ఇపుడు కొత్త కేసులు, మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.తొలిసారి 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా (1,002) మరణాలు నమోదయ్యాయి. 33,208 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని దేశ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 79.50 లక్షలకు చేరుకోగా, 2.22 లక్షల మంది కరోనాకు బలయ్యారు.
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు, కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో నిలిచింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, కరోనా నిబంధనల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడమే కరోనా తాజా విజృంభణకు కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు







