ఫ్లూ వ్యాక్సిన్ క్యాంపెయిన్ ప్రారంభం
- October 17, 2021
అబుధాబి: అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) ఎమిరేట్‌లో రెసిడెంట్స్ కోసం వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, ది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సెంటర్ ఫర్ పబ్లిక్ హెల్త్ హెల్త్ "ఇమ్యునైజ్ యువర్ సెల్ఫ్.. ప్రొటెక్ట్ యువర్ కమ్యూనిటీ" పేరిట ఈ డ్రైవ్ ను ప్రారంభించాయి. సకాలంలో టీకాలు వేయడం ద్వారా తీవ్రమైన లక్షణాలు, ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నౌరా అల్ ఘైతి తెలిపారు.
"సీజనల్ influenza వంటి వైరస్ల పట్ల మనం అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.ఫ్లూ వ్యాక్సిన్ లక్షణాల ప్రమాదాన్ని తగ్గించగలదు. అలాగే హాస్పిటలైజేషన్ అవసరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి."అని ఆమె చెప్పారు.
50 ఏళ్లు పైబడిన వారు, 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, తీఖా కార్డు హోల్డర్లు, హజ్- ఉమ్రా ప్రదర్శకులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఈ వ్యాక్సిన్ ఉచితంగా లభిస్తుంది. ఇతర వర్గాలకు 50 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.సేహా ఆరోగ్య కేంద్రాలు, కోవిడ్ -19 డ్రైవ్-త్రూ సేవా కేంద్రాలలోని అబుధాబి, అల్ ఐన్ అండ్ అల్ దఫ్రాలోని నివాసితులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అధికారులు చెప్పారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







