బహ్రెయిన్ - ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష
- October 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక శాఖ మంత్రి జాయెద్ బిన్ రషీద్ అల్జయానీ.. ఒమన్ వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి కైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్‌తో సమావేశమయ్యారు. బహ్రెయిన్ - ఒమన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు ఉద్దేశించిన అన్ని కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అల్జయానీ స్పష్టం చేశారు. వాణిజ్యం, పరిశ్రమ కమిటీల సమావేశాలు, జీసీసీ మార్చ్ కు సంబంధించిన సమస్యలతో పాటు, ద్వైపాక్షిక సంబంధాలు, ఉమ్మడి సహకారం లాంటి అంశాలను ఇరు దేశాల ప్రతినిధులు సమీక్షించారు. ఈ జీసీసీ వాణిజ్య మంత్రుల సమావేశంలో బహ్రెయిన్ వాణిజ్యశాఖ అండర్ సెక్రటరీ ఎమాన్ అహ్మద్ అల్ దోసర్, అసిస్టెంట్ అండర్ సెక్రటరీ షేక్ హమద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







