దుబాయ్-సోహార్ మధ్య విమాన సర్వీసులు.. నవంబర్ 4 నుంచి ప్రారంభం
- October 20, 2021
దుబాయ్: దుబాయ్‌కి చెందిన ఫ్లై దుబాయ్ ఒమన్‌లోని సోహార్‌కు విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది.దీంతో దుబాయ్-సోహార్ మధ్య విమానాలు నడిపే తొలి విమానయాన సంస్థగా ప్లై దుబాయ్ నిలిచింది.సుల్తానేట్ నుంచి ఒమన్ మధ్య ఇది మూడో మార్గం కానుంది. ఇప్పటికే దుబాయ్-మస్కట్, దుబాయ్-సలాల మధ్య విమాన సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్-సోహార్ మధ్య విమాన సర్వీసులు నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి.దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2 నుంచి వారానికి రెండుసార్లు ఈ సర్వీసులను నడుపనున్నారు.ఫ్లై దుబాయ్ సీఈఓ గైత్ అల్ గైత్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ ట్రావెల్‌పై ఆంక్షలను ఎత్తివేయడంతో, ఒమన్‌లో సోహార్‌కు విమాన సర్వీసులను ప్రారంభించాం.మా నెట్వర్క్ ను మరింత పెంచడానికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నాం.దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్ పో 2020 సందర్శించడానికి రావాలనుకునే ఒమన్ ప్రయాణికులకు ఈ రూట్ ఉపయోగపడుతుంది.’’ అని అన్నారు. ‘‘ఈ కొత్త మార్గంతో ఒమన్ లో మా నెట్ వర్క్ మరింత విస్తరిస్తుంది. ఈ కొత్త మార్గం టూరిజం, వాణిజ్య రవాణాను మరింత పెంచడంతోపాటు ఒమన్-యూఏఈ మధ్య విమానయాన బంధాన్ని ఇది బలోపేతం చేస్తోంది.’’ అని ఫ్లై దుబాయ్ కమర్షియల్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







