ఐఎంఎఫ్‌ను వీడనున్న చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్
- October 20, 2021
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకానమిస్ట్‌గా ఉన్న గీతా గోపినాథ్ ఆ పోస్టును వీడి వెళ్తున్నారు. మూడేళ్ల పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు సేవలు అందించిన ఆమె మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్రం శాఖలో చేరనున్నారు. ఏడాది పాటు హార్వర్డ్ వర్సిటీకి లీవ్ పెట్టివచ్చిన గీతా గోపినాథ్.. ఐఎంఎఫ్‌లో మూడేళ్లు పాటు పనిచేశారు. ఐఎంఎఫ్‌లో పరిశోధనా విభాగానికి ఆమె అధిపతిగా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలను ఆమె ఆధ్వర్యంలోనే తయారయ్యేవి.
జీడీపీ అంచనాల నివేదికలను ఆమె తయారు చేసేవారు. చీఫ్ ఎకనామిస్ట్ పోస్టులో పని చేసిన తొలి మహిళ గీతా గోపినాథ్ అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జీవా ప్రశంసించారు. కరోనా మహమ్మారి వేళ ఆర్థిక రిపోర్ట్‌లను వెల్లడించినట్లు క్రిస్టలినా తెలిపారు. ఐఎంఎఫ్‌కు గీత చేసిన సాయం అసాధారణమైందన్నారు. అమెరికా, భారత్‌లో పౌరసత్వం ఉన్న గీతా గోపినాథ్.. 2018 అక్టోబర్ లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







