ఎక్స్‌పో 2020 దుబాయ్ వద్ద కోవిడ్ సేఫ్టీపై కొత్త విధానం

- October 20, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్ వద్ద కోవిడ్ సేఫ్టీపై కొత్త విధానం

యూఏఈ: ఎక్స్‌పో 2020 దుబాయ్ నేపథ్యంలో డెవలప్మెంట్ మరియు డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పయోనీరింగ్ ఎపిడెమిలాజికల్ మోడలింగ్ అనే టూల్ ఏర్పాటు చేసి, ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఎక్స్‌పో దుబాయ్ 2020, అబుదాబీ పబ్లిక్ హెల్త్ సెంటర్, ఖలీఫా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ టూల్ వినియోగిస్తున్నాయి. సందర్శకుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. కోవిడ్ 19 నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి, అందుబాటులో వున్న సమాచారాన్ని విశ్లేషించి.. తమ వ్యూహాల్ని మార్చుకుంటున్నాయి అథారిటీస్.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com