'ఎఫ్‌సీఐ'లో ఉద్యోగాలు..
- October 21, 2021
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదు, ఎనిమిది తరగతి విద్యార్హతతో 380 వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 19, 2021. దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకుని అప్పుడు అప్లై చేయాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.23,000 నుంచి రూ.64,000 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలకు https://fci.gov.in/ లేదా https://recruitmentfci.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
ఎంపిక విధానం.. అభ్యర్ధిని రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 120 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను ఇంగ్లీష్, హిందీ, పంజాబీలో నిర్వహిస్తారు. పరీక్షలో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సందర్శించాలి. ఇక్కడ category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి
అనంతరం నోటిఫికేషన్ చదవాలి. అర్హతలు చూసుకున్న తరువాత దరఖాస్తు చేసుకోవడానికి https://fciharyana-watch-ward-in/loginపైన క్లిక్ చేయాలి. కుడివైపు ఉన్న Register Here పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి. వచ్చిన instructions చదవాలి దాని కింద ఉన్న చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి పేరు, ఫోటో ఐడీ, ఈ మెయిల్, మొబైల్ నెంబర్, విద్యార్హతలు నింపాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తయిన తరువాత ఫ్రింట్ తీసి ఉంచుకోవాలి. అప్లై చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 19,2021.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







