బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం

- October 21, 2021 , by Maagulf
బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం

రియాద్: సౌదీ ఆరోగ్య శాఖ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు హై రిస్క్ లో ఉన్న వారికే బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఐతే రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలల వ్యవధి ఉన్న వారు మాత్రమే బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. "Tawakkalna", "sehhati"  యాప్ ల ద్వారా అపాయింట్ మెంట్ ను బుక్ చేసుకోవచ్చు. హై రిస్క్ కేటగిరీలో ఉన్న వారు మాత్రం తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ చాలా మందికి కరోనా పాజిటివ్ వస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారికి, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కు రిస్క్ ఎక్కువగా ఉంది. దీంతో ముందుగా వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ ప్రభుత్వానికి సూచించారు. ఆ మేరకు సౌదీ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా 18 ఏళ్లు నిండిన వారందరికీ కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com