భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్

- October 22, 2021 , by Maagulf
భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్

కువైట్: భారీ ట్రక్కులు, మెషినరీ వాహనాలతో ఫర్వానియా రెసిడెంట్స్ పరేషాన్ అవుతున్నారు. తమ ఇండ్లు, షాపుల ముందు భారీ వాహనాలు అక్రమంగా పార్కింగ్ చేస్తున్నాయని, దాంతో తమ వాహనాలు పెట్టుకునేందుకు సైతం స్థలాలు లేకుండా పోతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అల్-రాయ్ ఫోటోగ్రాఫర్.. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ ట్రక్కులు అక్రమంగా పార్కింగ్ చేయడాన్ని గమనించారు. ఈ ట్రక్కులు, భారీ వాహనాల కారణంగా రెసిడెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, భారీ వాహనాలకు ఇతర ప్రాంతాల్లో స్థలాన్ని ఏర్పాటు చేయాలని అల్-రాయ్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com